🖤5 ఏళ్లకి అమ్మను కోల్పోయిన నా జీవిత కథ ఇక్కడ మొదలయింది నాకు 5 సంవత్సరాలు ఉన్నపుడు. నా వయస్సు 5 సంవత్సరాలు..అప్పుడే నా జీవితంలో మొదటి దెబ్బ తగిలింది.నా అమ్మ..నా ఊపిరి..ఒక్కసారిగా నన్ను వధిలేసి వెళ్ళి పోయింది ఆరోజు నాకు ఏమి అర్థం కాలేధు. ఒకపక్క అంధరు ఏడుస్తూ ఉన్నారు.. ఆ టైమ్ లో అంధరు నన్ను చూసి , అయ్యో పాపం చిన్న పిల్లాడు అని, అందరూ నన్ను పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు.. నాకు మాత్రం ఒక్కటి అర్థమైంది మా అమ్మ నాకోసం మళ్ళీ రాధు అని . ఆరోజు తర్వాత నా జీవితం మొత్తం మారిపోయినధి. ఏం చేయాలో తెలియని పరిస్థితి , ఆకలి అయితే ఎవర్ని ఆడగలో తెలియని పరిస్థితి . నాకు ఒక తమ్ముడు ఒక అక్క ఉన్నారు . తమ్ముడు నాకంటే ఇంకా చిన్నవాడు , పాలు తాగే పిల్లవాడు. మా ఇంట్లో మా నాన్న మమ్మల్ని పట్టించుకునేవాడు కాధు. మా నానమ్మ వాళ్ళు కూడా సరిగ్గా చూసకునేవాళ్ళు కాధు . తింటే తినేవాళ్ళం లేధు అంటే ఉపవాసం ఉండే వాళ్ళం . తర్వాత కొన్నిరోజులకి మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ” అస్సలు కథ అప్పుడే మొదలైంది 👇 “ మా నాన్న పెళ్లి చేసుకుంటే మమ్మల్ని చూసుకోడానికి మాకు మరో అమ్మ వస్తది అనుకున్న సమయం లో, మా ఆశలు అన్నీ నిరాశలు అయిపోయాయి. ఎందుకు అంటే మా నాన్న అతనికి భార్యని తెచ్చుకున్నాడు, కానీ మాకు మా అమ్మలాంటి అమ్మను తేలేకపోయాడు . మా నాన్న మా అమ్మ వాళ్ళు వాళ్ళ సంతోషము మాత్రమే చూసుకునేవాళ్ళు . మమ్మల్ని పట్టించుకునేవారు కాధు అన్నం కూడా మాకు సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు . మా ఇంటి పక్కన చుట్టాలు, మేము ఆకలితో ఉన్నాం అని తెలిసి, మమ్మల్ని తిన్నవా అని అడిగేవారు కాధు. మా అమ్మ ఉంటే మాకు అంతా కష్టం వచ్చేది కాదు😥 . అస్సలు మా అమ్మ ఎంధుకు చనిపోయిందో మీకు నేను చెప్పలేధు కదా. గుండెపోటు వచ్చి చనిపోయింది . అస్సలు గుండెపోటు ఎందుకు వచ్చింది ? దానికి కారణం ఏమిటి ? మనం రెండవ పార్ట్ లో మాట్లాడుకుంధాము. 👉అమ్మ లేకుండా పెరిగిన నా జీవిత కథ పార్ట్ 2 లో కలుద్దాం … మరిన్ని వివరాలకు నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. https://www.instagram.com/im_shree_02?igsh=bGF6cmkzcHl2MWkz