🖤5 ఏళ్లకి అమ్మను కోల్పోయిన నా జీవిత కథ ఇక్కడ మొదలయింది నాకు 5 సంవత్సరాలు ఉన్నపుడు.నా వయస్సు 5 సంవత్సరాలు..అప్పుడే నా జీవితంలో మొదటి దెబ్బ తగిలింది.నా అమ్మ..నా ఊపిరి..ఒక్కసారిగా నన్ను వధిలేసి వెళ్ళి పోయింది ఆరోజు నాకు ఏమి అర్థం కాలేధు.ఒకపక్క అంధరు ఏడుస్తూ ఉన్నారు..ఆ టైమ్ లో అంధరు నన్ను చూసి ,అయ్యో పాపం చిన్న పిల్లాడు అని,అందరూ నన్ను పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు..నాకు మాత్రం ఒక్కటి అర్థమైంది మా అమ్మ నాకోసం మళ్ళీ రాధు అని .ఆరోజు తర్వాత నా జీవితం మొత్తం మారిపోయినధి.ఏం చేయాలో తెలియని పరిస్థితి ,ఆకలి అయితే ఎవర్ని ఆడగలో తెలియని పరిస్థితి .నాకు ఒక తమ్ముడు ఒక అక్క ఉన్నారు .తమ్ముడు నాకంటే ఇంకా చిన్నవాడు , పాలు తాగే పిల్లవాడు.మా ఇంట్లో మా నాన్న మమ్మల్ని పట్టించుకునేవాడు కాధు.మా నానమ్మ వాళ్ళు కూడా సరిగ్గా చూసకునేవాళ్ళు కాధు .తింటే తినేవాళ్ళం లేధు అంటే ఉపవాసం ఉండే వాళ్ళం .తర్వాత కొన్నిరోజులకి మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు.” అస్సలు కథ అప్పుడే మొదలైంది 👇 “మా నాన్న పెళ్లి చేసుకుంటే మమ్మల్ని చూసుకోడానికి మాకు మరో అమ్మ వస్తది అనుకున్న సమయం లో,మా ఆశలు అన్నీ నిరాశలు అయిపోయాయి.ఎందుకు అంటే మా నాన్న అతనికి భార్యని తెచ్చుకున్నాడు,కానీ మాకు మా అమ్మలాంటి అమ్మను తేలేకపోయాడు .మా నాన్న మా అమ్మ వాళ్ళువాళ్ళ సంతోషము మాత్రమే చూసుకునేవాళ్ళు .మమ్మల్ని పట్టించుకునేవారు కాధుఅన్నం కూడా మాకు సరిగ్గా పెట్టేవాళ్ళు కాదు .మా ఇంటి పక్కన చుట్టాలు,మేము ఆకలితో ఉన్నాం అని తెలిసి,మమ్మల్ని తిన్నవా అని అడిగేవారు కాధు.మా అమ్మ ఉంటే మాకు అంతా కష్టం వచ్చేది కాదు😥 . అస్సలు మా అమ్మ ఎంధుకు చనిపోయిందో మీకు నేను చెప్పలేధు కదా. గుండెపోటు వచ్చి చనిపోయింది .అస్సలు గుండెపోటు ఎందుకు వచ్చింది ?దానికి కారణం ఏమిటి ? మనం రెండవ పార్ట్ లో మాట్లాడుకుంధాము.👉అమ్మ లేకుండా పెరిగిన నా జీవిత కథ పార్ట్ 2 లో కలుద్దాం …మరిన్ని వివరాలకు నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. Post navigation మా అమ్మ లేకుండా పెరిగిన నా జీవత కథ -Part 2
Bro Ni bada nu share cheskuntunnaduku Tq e lokamulo Andaru telsukovali Badyta bandalu prema lu maarichipovadduReply