16 సంవత్సరాల తర్వాత అస్సలు ఏం జరిగింది… అమ్మ లేకుండా పెరిగిన నా జీవిత కథ లో అప్పు డు నాకు 17 సంవత్సరాలు నేను ఎవ్వరికీ చెప్పకుండా , హైదరాబాద్ వెళ్లిపోయాను డబ్బులు సంపాదించడానికి . కానీ నాకు సరైన age లేదని నాకు ఎవ్వరూ జాబ్ ఇవ్వలేదు . secundrabad bustand లో ఆకలితో కూర్చున్న ఏం అర్థం కావట్లే నా దగ్గర ఉన్న పైసలు మొత్తం ఐపోయినాయి 😥. అలాంటి సమయం లో నాకు ఒక అన్నయ్య కలిశాడు , నాతో మాట్లాడాడు ,అతనికి డాక్టర్ జాబ్ వచ్చింది అని నాతో అన్నాడు వెంటనే నన్ను తీస్కొనివ వెళ్ళి బిర్యానీ తినిపించాడు ఆకలితో ఉన్న నాకు దేవుడు ఆ అన్నయ్య రూపం లో సాయం చేశారు 🙏. తర్వాత మళ్ళీ నేను జాబ్ ప్రయత్నం చేశా అప్పుడు , నాకు ఒక మెడిసిన్ ఇండస్ట్రి లో worker గా తీస్కున్నరు . 40 kgs turbo cans నాతో మోయించారు చాలా కష్టపడిన . అక్కడ పని చేసే వాళ్ళు అందరూ నన్ను చూసి ఇలా అన్నారు , అస్సలు నువు ఎందుకు ఇక్కడికి వచ్చావు ఇంత చిన్న వయసులో అన్నారు . కానీ నా మైండ్ లో ఒక్కటే రన్ అవత్తునది ఎలాగైనా డబ్బులు సంపాదించాలి . తర్వాత కొన్ని రోజులు అలా గడిచి పోయాయి . తర్వాత నాకు జీతం ఇచ్చే టైమ్ లో జీతం ఇవ్వలేదు కంపెనీ ఏజెంట్ . ఇగ నాకు అర్థమైంది నన్ను మోసం చేస్తున్నారు అని . వెంటనే నేను నాతో పని చేసే ఒక అన్నయ్య దగ్గర డబ్బులు 100 rs తీసుకున్న మా ఊరికి స్టార్ట్ అయిన secundrabad వరకు బస్ ఎక్కిన తర్వత ట్రైన్ ఎక్కిన సక్కగా మా ఇంటికి వచ్చిన మళ్ళీ నా లైఫ్ స్టార్టింగ్ కి వచ్చింది . స్టడీ చేయడం ఆపేశా పిచ్చి లేసింది కాలిగా ఉంటుంటే , అందరూ నన్ను తిట్టేవాళ్ళు కాలిగా ఉంటున్నావు అని తర్వాత కిరాణం షాప్ లో పని చేశా 3000 rs జీతానికి . రోజు 2 km నడుస్తూ షాప్ కి వెళ్ళేవాన్ని పని చేయడానికి . తర్వాత కొన్నిరోజులకి door to door తిరిగి సమన్లు అమ్మిన . మళ్ళీ అది సెట్ కాలేదు ,తర్వాత సుజుకి షోరూం లో చేశా మెకానిక్ గా నేర్చుకున్న . కొన్నిరోజులకి షోరూం తీసేశారు నేను మళ్ళీ వేరే పని వెతుకున్న మొబైలు షాప్ లో పని స్టార్ట్ చేశా ఇందులో నేను 2 సంవత్సరాలు చేశా . అప్పటికి నాకు కొంచెం meturity వచ్చింది . మళ్ళీ చదువు స్టార్ట్ చేశా పని చేస్కుంటా MLT [ MEDICAL LAB TECHNICIAN ] పూర్తి చేశాను 800/1000 మార్క్స్ తో పాస్ అయిన . తర్వత ట్రైనింగ్ లుదా పూర్తి చేశా ఒక సంవత్సరం . ఫైనల్ గా సర్టిఫికేట్ వచ్చింది రిజిస్ట్రేషన్ కూడా చేపించిన . తర్వత కరీంనగర్ అపోలో రీచ్ హాస్పిటల్ లో జాబ్ వచ్చింది . హ్యాపీ గా జాబ్ చేస్కుంటా కాలం గడిపిన ,మళ్ళీ హైదరాబాద్ లో NIMS హాస్పిటల్ లో జాబ్ వచ్చింది అపుడు ఇంకా హ్యాపీ ఐపోయా ఇప్పటి నుండి అస్సలు కథ మొదలయితది … నిమ్స్ లో వర్క్ స్టార్ట్ చేశాక ఇంకా మంచి అనుభవం వచ్చింది నన్నే టీం లీడర్ గా పెట్టారు మా స్టాఫ్ కి నేనే DUTYS వేసేవాన్ని BEST EMPLOYEE పోస్ట్ ఇచ్చారు. కొన్ని రోజులకి ఒక అమ్మాయి పరిచయం అయింది . మళ్ళీ ఒక లవ్ స్టోరీ స్టార్ట్ అయింది 😂 ఆమె స్టాఫ్ కాదు , వాళ్ళ DAD ని చూపించడానికి మా హాస్పిటల్ కి వస్తే టెస్ట్ లు నేనే చేశా . అప్పుడు న నెంబర్ ఆమే తీస్కునది reports పంపండి అని చెప్పింది . అలా కొన్ని రోజులు సాగిపోయింది ,మొదట్లో ఫ్రెండ్స్ గా ఉన్నాము . తర్వాత లవ్ స్టార్ట్ అయింది చాలా క్లోస్ ఐపోయాము . తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ -5 లో చెప్తా … పార్ట్ -1 మరియు పార్ట్ -2 మరియు పార్ట్ -3 లినక్స్ ఇస్తున్న . మీకు నచ్చితే మీ freinds కి కూడా షేర్ చేయండి 🙏 మిగతా వివరాలకి నా instagram page ని fallow అవ్వండి . Post navigation “అమ్మ లేకుండా పెరిగిన నా జీవిత కథ PART-3